![]() |
![]() |

సర్కార్ సీజన్ 6 లేటెస్ట్ ప్రోమోలో విష్ణుప్రియ కామెడీ మాములుగా లేదు. ఈ ప్రోమోలో రఘు మాష్టర్ తన వైఫ్ ప్రాణవితో కలిసొచ్చి "అందమా అందమా" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక పక్కనే ఉన్న విష్ణు ప్రియా ఐతే "నాకైతే వీళ్ళను చూస్తుంటే అర్జెంట్‌గా పెళ్లి చేసేసుకోవాలనిపిస్తోంది. సుధీర్ ఏమంటావ్ " అని అడిగింది విష్ణుప్రియ. వెంటనే అతను "ప్యాకప్ " అనేశాడు. "ప్రణవి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎం చెప్తారు " అని సుధీర్ అడిగేలోపు రఘు వెనక్కి తిరిగి నిలబడ్డాడు. షర్ట్ మీద "వరల్డ్ " అని రాసి ఉంది. "అబ్బా ఎంత అద్భుతంగా ప్రపంచం అని చూపిస్తున్నారండి" అంటూ సుధీర్ అన్నాడు. "కాదండి బాగా ఉతుక్కున్నానని చూపిస్తున్నారండి " అంది .
"మాష్టర్ కోసం మీరు ఏదైనా మంచి పాట " అని సుధీర్ అడిగాడు. "ఏందయ్యా సామి" అని పాడింది ప్రణవి. ఇక తర్వాత వీళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగాడు. "ఫ్లేమ్స్ ఫుల్ ఫార్మ్ లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉంటాయి" అని అడిగాడు సుధీర్. "ఫ్లేమ్స్ ఆడని ముఖానికి ఎం తెలుస్తాయి. తెలీనప్పుడు మూసుకుని కూసోవాలె" అంది ప్రణవి. "రఘు మాష్టర్ తరపున నేను సారీ చెప్తున్నా " అన్నాడు సుధీర్. దాంతో ప్రణవి గట్టిగా నవ్వుతూ నాకు సారీ సరిపోదు అంది.
"నాకు ఇక్కడ హారర్ ఫిలిం చూస్తున్నట్టు ఉంది " అనేశాడు. "మ్యారేజ్ అంటే ఏ ఏ ఎమోషన్స్ ఉంటాయో తెలుసుకున్నా కానీ ఫస్ట్ టైం భయం అంటే ఏమిటో పరిచయం చేశారు" అన్నాడు సుధీర్. ఇక విష్ణు ప్రియా బిగ్ బాస్ లో పృద్వితో లవ్ ట్రాక్స్ నడిపిన విషయం అందరికీ తెలిసిందే... మరి విష్ణు ఎవరిని పెళ్ళి చేసుకుంటుందో ఏమో.
![]() |
![]() |